అట్లూరు: స్పీడ్ బ్రేకర్ కారణంగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ మహిళ తలకు బలమైన గాయమై మృతి చెందింది. ఈ విషాద ఘటన గురువారం అట్లూరు మండల పరిధిలోని కొండూరు పోలీస్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అట్లూరు గ్రామానికి చెందిన ఆదూరి యశోదమ్మ (50) లింగాలకుంటలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం బంధువు మనోహర్‌రెడ్డితో కలిసి ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా, కొండూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి జారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు, పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త రామకృష్ణారెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


