ఏడో రోజూ కొనసాగిన నిమజ్జనాలు | - | Sakshi
Sakshi News home page

ఏడో రోజూ కొనసాగిన నిమజ్జనాలు

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

కడప సిటీ : బొజ్జ గణపయ్య నిమజ్జనాలు ఏడో రోజు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 95 శాతం మేర వినాయక విగ్రహాలు నిమజ్జనాలు పూర్తయ్యాయి. ఏడో రోజు నిమజ్జనంలో భారీ వినాయక విగ్రహాలకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బాణాసంచా పేలుస్తూ, డప్పు వాయిద్యాల మధ్య యువత ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వినాయక విగ్రహాలను ఇర్కాన్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఘాట్‌ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. మిగిలిన ఐదుశాతం వినాయక విగ్రహాలను తొమ్మిదవరోజు నిమజ్జనం చేయనున్నారు.

ఎన్జీఓ కాలనీలో..

కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement