అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయాలి

Sep 12 2026 1:30 AM | Updated on Sep 12 2026 1:30 AM

పార్టీ కార్యకర్తల సమావేశంలో

ఎంపీ మేడా, ఎమ్మెల్యే ఆకేపాటి

రాజంపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క స్థానం ఏకగ్రీవం కారాదని, అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీ పోటీ చేయాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో జీఎంసీ క్లబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మేడా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార దర్పంతో అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని, వాటికి బెదరనవసరం లేదన్నారు. ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. వర్గ విభేదాలు లేకుండా కలసికట్టుగా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలన్నారు. అన్ని వేళలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అన్ని మండలాల్లో కూడా వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని పేర్కొన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని మరోసారి ప్రజలకు ప్రతి కార్యకర్త తెలియజేయాలన్నారు. అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తోందన్నారు. భవిష్యత్తులో పార్టీలో గుర్తింపు కార్డులు కీలకం కానున్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, మున్సిపాలిటి చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ మేడా భాస్కర్‌రెడ్డి, ఎంపీ మేనల్లుడు మదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, స్టేట్‌ సీఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, మున్సిపాలిటి వైస్‌ చైర్మన్‌ మర్రి రవి, మండల పార్టీ కన్వీనర్లు గోపిరెడ్డి, నీలకంఠేశ్వరెడ్డి, టక్కోలు శివారెడ్డి, రామస్వామిరెడ్డి, రాజారెడ్డి, భాస్కర్‌రాజు, పట్టణ కన్వీనరు కృష్ణారావుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement