జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా...
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
వీఎన్ పల్లి మండలంలో బీడుగా మారిన పొలం
కడప అగ్రికల్చర్: జిల్లాలో కరువు ఛాయ కమ్ముకొస్తోంది. ఎల్‌నినో ఎఫెక్టుతో వర్షాలు కురిసే పరిస్థితి కనిపించకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రమైంది. కొన్ని మెట్టప్రాంతాల్లో పంట సాగన్నదే లేకుండా పోయింది. ఇక అక్కడక్కడ సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు 38 శాతం మించి కాలేదు. మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగియనుంది. ఇటు పంటలు సాగు కాక అటు సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వ్యవసాయ సాగు...
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేని కారణంగా వ్యవసాయశాఖ రైతుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా మెట్టప్రాంతంలో సాగు చేసుకునేందుకు వీలుగా ఉలవలు, మినుములు 80 శాతం సబ్సిడీతో అందించేందుకుకు సిద్ధం చేసింది. ఇందులో 1000 క్వింటాళ్లు మినుములు, 650 క్వింటాల్లు ఉలవలను పంపిణీ చేయనుంది. కావాల్సిన రైతులు విత్తనాలను తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ సూచించింది,
చాపాడు: ఎగువన శ్రీశైలం జలాశయం నిండినప్పటికీ ప్రభుత్వం కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయకపోవడంతో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 92వేల ఎకరాలు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వారం రోజులుగా కుందూ నది పూర్తిగా ఎండిపోవడం, ఎల్‌నినో ప్రభావంతో బోర్లలో సైతం నీరు అడుగంటడంతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్నాయి. అల్లాడుపల్లెలో మస్తాన్ వల్లి అనే రైతు తన 5 ఎకరాల పసుపు, మిరప పంటలను కాపాడుకోవడానికి బోరుబావిలోకి అదనపు పైపులు దించుతూ అవస్థలు పడుతుండగా, కేతవరంలో రైతు పరమేశ్వర నరసయ్య ఎండిపోయిన తన ఎకరా అలసంద పంటను దిక్కుతోచక ట్రాక్టర్‌తో తొలగించాడు. ఈ తరుణంలో కేసీ కెనాల్ డీఈఈ పుల్లయ్య స్పందిస్తూ.. రెండు రోజుల్లో కేసీ కాలువకు నీరు వదులుతున్నామని, అయితే ఇది కేవలం తాగునీటి అవసరాల కోసమేనని, రైతులు పంటల సాగు కోసం ఆశపడవద్దని స్పష్టం చేశారు. కనీసం తాగునీటి కోసమైనా వచ్చే నీటితో కుందూ నది పరివాహక పంటలు ఊపిరి పోసుకుంటాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎల్‌నినో పరిిస్థితుల నేపథ్యంలో వర్షాలు తక్కువ అవడంతో జిల్లాలో ఆనుకున్న మేర పంటలసాగు కాలేదు. ఈ పరిస్థితుల నేథఫ్యంలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా మినుములు, ఉలవలను సాగుచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసమని మినుములు, ఉలవలను కేటాయించాం. సబ్సిడీతో తీసుకెళ్లచ్చు.
– మట్టా సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అనుకున్న మేర వర్షాలు కురవకపోవడంతో చాలా మేర పంటలు సాగుకు నోచుకోలేదు. అక్కడక్కడ అరకొరగా సాగు చేసిన పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి జిల్లా రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
నాకు ఆరెకరాల మెట్ట పొలం ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సెంటు భూమి కూడా సాగు చేయలేదు. ఉన్న భూమంతా బీడుగానే ఉంది. ఏం చేయాలో ఆర్థం కావడం లేదు. ఈ నెలాఖరుకన్నా మంచి వర్షం కురిస్తే శనగపంట సాగు చేసుకొనే వీలుంటుంది. కానీ ఆ పరిస్థితి యాడా కనిపించడం లేదు.
– శ్రీనివాసులరెడ్డి, గంగిరెడ్డిపల్లె, వీఎన్ పల్లి మండలం.
నెల సాధారణ కురిసిన లోటు వర్షపాతం వర్షం వర్షపాతం
జూన్ 68.2 50.3 – 26.3
జులై 96.7 24.5 – 74.7
ఆగష్టు 118.4 66.7 – 43.7
సెప్టెంబర్ 117.2 0 0
మొత్తం 400.5 141.5 – 50


