● చెరువులు ఎడారి.. చేపలు తడారి.. | - | Sakshi
Sakshi News home page

● చెరువులు ఎడారి.. చేపలు తడారి..

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● చెరువులు ఎడారి.. చేపలు తడారి..

ప్రొద్దుటూరు రూరల్‌: చాపాడు మండలం చెంచుపల్లె గ్రామ సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణమున్న మడూరు చెరువు ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావం వల్ల పూర్తిగా ఎండిపోయింది. ప్రతి ఏడాది వర్షపు నీరు, కేసీ కెనాల్‌ నీటితో కళకళలాడే ఈ చెరువు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. చెరువులో అక్కడక్కడా గుంతల్లో మిగిలిన కొద్దిపాటి బురద నీటిలో వందలాది చేపలు ప్రాణాల కోసం విలవిలలాడుతున్నాయి. నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోవడంతో చేపలు పైకి వచ్చి అల్లాడుతూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఈ దయనీయ దృశ్యాలు చూసేవారి మనసులను కలిచివేస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ప్రొద్దుటూరు పట్టణం నుంచి జనం వచ్చి ఈ చేపలను పట్టుకెళ్తున్నా ఇంకా వందలాది చేపలు బురదలోనే ప్రాణాలు వదులుతున్నాయి. అయితే, ఈ రకం చేపలకు మార్కెట్లో పెద్దగా గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వేలాది జీవులకు ఆశ్రయమిచ్చిన చెరువు.. ఇప్పుడు వాటి మృత్యువేదికగా మారడం స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement