వైవీయూలో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, పీజీ ప్రవేశాలు షురూ | - | Sakshi
Sakshi News home page

వైవీయూలో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, పీజీ ప్రవేశాలు షురూ

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్య వి.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో వైవీయూ ఉపకులపతి) ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ హాజరై విద్యార్థులకు సీట్‌ అలాట్‌మెంట్‌ పత్రాలను అందజేశారు. ఏపీ ఉన్నత విద్యామండలి ‘ఓఎండీసీ’ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్‌ ప్రాతిపదికన వివిధ ఆనర్స్‌, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్లు కేటాయించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. నాణ్యమైన బోధన, అధునాతన గ్రంథాలయం, హాస్టల్‌ వసతితో రాష్ట్రంలోనే వైవీయూ మొదటి మూడు స్థానాల్లో నిలిచిందన్నారు. విద్యార్థులు మొదటి రోజు నుంచే లక్ష్యంతో చదివి ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాథరెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ విజయభారతి తదితరులు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో

సైన్స్‌ దే కీలకపాత్ర

కడప ఎడ్యుకేషన్‌: శాసీ్త్రయ సమాజ నిర్మాణంలో సైన్స్‌ , ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ పేర్కొన్నారు. కడప జయనగర్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం సైన్స్‌ ఉపాధ్యాయులకు ఇన్‌స్పైర్‌ మనక్‌ నామినేషన్లు, ఎకో క్లబ్‌ కార్యక్రమాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి లేబాక బాలాజీ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 15వ తేదీలోగా ఇన్‌స్పైర్‌ మనక్‌ నామినేషన్లను వంద శాతం పూర్తి చేసి, జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. అలాగే ఎకో క్లబ్‌ రిజిస్ట్రేషన్‌, పర్యావరణ విద్య కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్‌ మ్యూజియం క్యూరేటర్‌ రెహమాన్‌, ఎన్జీసీ కో–ఆర్డినేటర్‌ విజయప్రసాద్‌, పలువురు రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement