డీఎంహెచ్‌ఓ యుగంధర్
సిద్దవటం : పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని కడప డీఎంహెచ్‌ఓ యుగంధర్ తెలిపారు. మండలంలోని మాధవరం1 గ్రామ పంచాయతీ లోని సచివాలయం–2 పరిధి లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో బుధవారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో పాల్గొని టీకాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో బుధ, శనివారాల్లో పిల్లలకు, గర్భిణులకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తారని పేర్కొన్నారు. పిల్లలకు తట్టు రాకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయానికి విధులకు హాజరై పేషంట్లకు వైద్య సేవలు అందించాలన్నారు. డీఐఓ ప్రవీణ్ కుమార్, మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య పాల్గొన్నారు.


