సింహాద్రిపురం: మండల కేంద్రమైన సింహాద్రిపురంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ బుధవారం ముస్లిం సోదరులు రెండో రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా నాలుగు రోజుల పాటు నాలుగు దిక్కుల్లోని బీడు భూములలో ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి, పాడిపంటలు బాగా పండేలా అల్లాహ్ కరుణించాలని వేడుకున్నారు. శుక్రవారం జరిగే ముగింపు ప్రార్థనలలో ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


