స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొందాం

పనిచేసే కార్యకర్తలనే

అభ్యర్థులుగా నిలుపుదాం

వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి

సమావేశంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి దేనికైనా సిద్ధపడే తెగువ కలిగి ఉండాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఊటుకూరులోని కడప కన్వెన్షన్‌లో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోలీసులను, విచ్చలవిడిగా సంపాదించిన డబ్బును నమ్ముకుందని, మనం వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ చేసిన గొప్ప అభివృద్ధి పనులను నమ్ముకున్నామని వివరించారు. త్యాగాలకు సిద్ధపడి ఏటికి ఎదురీదుతున్నామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సమిష్టిగా పనిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలని సూచించారు. కూటమి నేతలు చేయగలిగింది అక్రమ కేసులు పెట్టడమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పనిచేసే కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలబెడతామని, వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందిందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ వజ్రభాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్‌, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఆదిత్యరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు, సమావేశంలో మాట్లాడుతున్న కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement