ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించాలనేదే లక్ష్యం అని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ ఇషాక్ బాష అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ బృందం నుంచి కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాష, సభ్యులు, కడప ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి పనులపై స్థానిక టీటీడీ సమావేశం భవనంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఇషాక్‌బాష మాట్లాడుతూ..2014లో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని ఆంధ్రా భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ ఎంత ఖర్చు చేసింది, అందులో ఏఏ పనులు పూర్తి ఆయ్యాయి, కొత్తగా ఎన్ని పనులు మంజూరు అయ్యాయి అన్నదానిపై ఆలయ టీటీడీ అధికారులు, జిల్లా ప్రభుత్వ అధికారులతో ఆయన చర్చించారు. ఇప్పటి వరకు భక్తులకు అందని సౌకర్యాలలో కొన్ని అంశాలు తాము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని ఇషాక్ భాష, రామచంద్రారెడ్డి అన్నారు. సమావేశానికి ఇరిగేషన్‌శాఖకు సంబంధించి ఏఈ కిశోర్ సమావేశం ముగిసే సమాయానికి రావడంపై కమిటీ చైర్మన్ మండిపడ్డారు. అతనిపై చర్యలు తీసుకునే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాన్నారు. రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ సుబ్బారెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో నరసింహముర్తి , కడప ఆర్డీవో మురళి, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ, జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ హామీలు అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ హామీలను అమలు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఇసాక్‌బీషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కమిటీ వివిధ విభాగాలను పరిశీలించింది. అనంతరం కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాలను సందర్శించింది.విద్యార్థులకు అందుతు న్న సౌకర్యాలను పరిశీలించింది. డీఈఓ షంషుద్దీన్, హెచ్‌ఎం నాగమణి, పీడీ వెంకటలక్ష్మి,జీజీహెచ్ సూపరింటెండెంట్ పెంచలయ్య, పాల్గొన్నారు.
బ్రౌన్ కేంద్రం నిర్వహణ భేష్
కడప ఎడ్యుకేషన్: కడప సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహణ తీరు భేష్‌గా ఉందని ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అస్సూరెన్స్ కమిటీ చైర్మన్ కాంట్రాక్టర్ ఇసాక్ బాషా ప్రశంసించారు. సోమవారం ఈ కేంద్రాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు ఇక్కడి తాళపత్ర గ్రంథాలు, భారత రాజ్యాంగ ప్రతిని పరిశీలించారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రంథాలయ వార్షిక బడ్జెట్‌ను రూ.10 లక్షల నుండి రూ.కోటికి పెంచాలని, భవన నిర్మాణ కార్యకలాపాలకు రూ. 4.63 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై చైర్మన్ ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి స్పందిస్తూ, బ్రౌన్ గ్రంథాలయ ప్రగతికి నిధులు మంజూరయ్యేలా శాసనమండలిలో తమ వాణిని వినిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ ప్రతినిధులను వీసీ రాజశేఖర్, ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ పి.పద్మ సత్కరించారు.
కడప సిటీ : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న కడప అమీన్‌పీర్ దర్గా గురువులను సోమవారం ఏపీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ ఇషాక్‌బాషా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ బృందం చైర్మన్


