చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధి కొండపేట గ్రామంలో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 22 గ్రాముల బంగారు, 79 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ చాంద్‌బాషా, ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నంద్యాల నరేంద్ర ఇంటిలో గతేడాది జూలై 25న గుర్తు తెలియని వ్యక్తులు బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కడప సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితుడు కొప్పెర్ల ప్రసన్న కుమార్‌ను అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేంద్ర కారాగారానికి తరలించారు.


