కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుంబంధంగా ఉన్న సంఘాలను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈనెల 12వ తేది నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనుబంధ విభాగాల పనితీరు, పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని సూచించారు. ఈ సమావేశాలకు రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు హాజరు కావాలని ఆదేశించారు. నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాల బాధ్యులు సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలను క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలం చేయడమే ఈ సమావేశా ల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనుబంధ విభాగాల బలోపేతంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తా మని వెల్లడించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిసునీల్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ నాయక్, ఎన్. శివరామ్, మదీనా దస్తగిరి, లక్ష్మిరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, డాక్టర్ నాగార్జునరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, టీపీ వెంకట సుబ్బమ్మ, బండి దీప్తి, సాయిదత్త, సూర్యనారాయణ, జాషువా, మహబూబ్ బాష, పి. సంపత్‌కుమార్, చెన్నకేశవరెడ్డి, వరదారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, హృషికేశవరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి


