డీఎస్సీ అక్రమాలపై పోరు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై పోరు

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు

పాల్గొననున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు

కడప కార్పొరేషన్‌ : డీఎస్సీ–2025లో జరిగిన అవకతకలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరు కొనసాగిస్తోంది. గతంలో విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు చేసిన ఆ పార్టీ, ఈనెల 6,7,8 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది. ఇందులో పార్టీ నేతలతోపాటు డీఎస్సీ, అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. తాజాగా ఈనెల 10వ తేది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్‌ కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్‌, పులివెందుల, రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత 16వేల పోస్టులకు డీఎస్సీ–2025 నిర్వహించారు. ఈ డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని బాధితులు, వైఎ స్సార్‌సీపీ ఆరోపిస్తోంది. మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యో గాలు ఇవ్వకుండా పరీక్షలు రాసిన వారి డేటాను ఆన్‌లైన్‌ నుంచి తొలగించడం... మొదటి ర్యాంకు వచ్చిన ఎన్‌సీఆర్‌టీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వకపోవడం వంటివి దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐతోగానీ, సిట్టింగ్‌ జడ్జితోగానీ విచారణ జరపాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తూ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోంది. వీటన్నింటికీ బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖామంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని కూడా ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అలాగే బకాయి ఉన్న రూ.10వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కోరుతోంది. ఈ డిమాండ్లతోనే ఈనెల 10వ తేది అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.

నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలను విజయవంతం చేయా లని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి కోరా రు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలని, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. సోమవా రం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపారు. యువత ర్యాలీలలో పాల్గొని నిరసన తెలియజేయాలన్నారు.

ర్యాలీలపై కూటమి కుట్ర

పోలీసుల ద్వారా నోటీసులు అందజేత

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ మేరకు ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ నాయకులందరికీ పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయిస్తోంది. పులివెందులలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ కే సురేష్‌ బాబు, వైఎస్‌ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ రెడ్డి , మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ,బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరి సుధా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి తదితరులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement