ముద్దనూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో నియోజకవర్గ పరిధిలోని రెండు ప్రధాన రవాణా సమస్యలకు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి సానుకూల స్పందన లభించింది. కమలాపురం, ముద్దనూరు రైల్వే స్టేషన్లలో తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు గుంతకల్ రైల్వే డివిజన్ ఆమోదం తెలిపింది. అలాగే, చెన్నూరు జాతీయ రహదారి 40 వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు.
తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు గుంతకల్ డివిజన్ గ్రీన్ సిగ్నల్
కమలాపురం, ముద్దనూరు రైల్వే స్టేషన్లలో తిరుమల ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 18521/18522) హాల్టింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి సమర్పించిన విజ్ఞప్తిపై గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా స్పందించారు. ఈ ప్రతిపాదనను డివిజనల్ స్థాయిలో ఆమోదించి, తదుపరి పరిశీలన కోసం రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు.
సర్వీస్ రోడ్ల నిర్మాణానికి చైర్మన్ హామీ
ఎన్‌హెచ్–40 పరిధిలోని కడప–కర్నూలు సెక్షన్‌లో చెన్నూరు పట్టణం వద్ద సర్వీస్ రోడ్లు, బస్ షెల్టర్లు, కవర్డ్ డ్రైన్ల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని ఎంపీ న్యూఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. గతంలో స్థానిక ప్రతిఘటన లు, కోర్టు కేసుల కారణంగా 2022లో పనులు పూర్తయినా సర్వీస్ రోడ్లు నిర్మించలేదని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నా యని వివరించారు. ప్రస్తుతం స్థానిక ప్రజలు భూ ములిచ్చేందుకు అంగీకరించినందున పను లు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని కోర గా, చైర్మన్ సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎంపీ అవినాష్‌రెడ్డి చొరవ


