కారు ఢీకొని కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని కూలీ మృతి

Feb 21 2026 7:17 AM | Updated on Feb 21 2026 7:17 AM

కారు

కారు ఢీకొని కూలీ మృతి

కారు ఢీకొని కూలీ మృతి రైలు నుంచి జారి పడి..

జమ్మలమడుగు రూరల్‌ : మండలంలోని చిటిమిటిచింతల(పాటి) టోల్‌గేట్‌ సమీపాన కారు ఢీకొన్న సంఘటనలో శుక్రవారం పూజారి మైసురయ్య (48) అనే రోడ్డు కూలీ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు గ్రామానికి చెందిన పూజారి మైసురయ్య ముద్దనూరు రహదారిలో ఉన్న టోల్‌గేట్‌ సమీపాన రోడ్డు పనులు చేస్తుండగా.. ముద్దనూరు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కదులుతున్న రైలు నుంచి జారి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ నుంచి తిరుచానూరు వెళ్తున్న రైలు శుక్రవారం ఉదయం కడప రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఈ రైలు నుంచి కడప కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలో బీటెక్‌ చదువుతున్న షేక్‌ సైపుల్లా అనే కడపకు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. మృతుడు కుటుంబంతో సహా హైదరాబాదుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కడప రైల్వే స్టేషన్‌లో దిగే సమయంలో సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రెండ్స్‌ను కలవడానికి వెళ్తూ..

ప్రొద్దుటూరు క్రైం : 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి.. స్నేహితులను కలుసుకొని వారు ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు పునీత్‌ (15) బైక్‌లో బయలుదేరాడు. అయితే మార్గంమధ్యలోనే లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన బంకా ఇమ్మానియేల్‌ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు పునీత్‌ స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అతనికి ప్రొద్దుటూరులో స్నేహితులు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీస్తున్నందున వారు ఎలా ప్రిపేర్‌ అవుతున్నారో తెలుసుకునేందుకు శుక్రవారం బైక్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మైదుకూరు రోడ్డులోని సినిహబ్‌కు వెళ్లే మలుపు వద్ద లారీని ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడు. లారీ ఒక్కసారిగా అతని మీదుగా వెళ్లడంతో పునీత్‌ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రూరల్‌ ఎస్‌ఐ కేసీ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వన్డే మ్యాచ్‌లో నెల్లూరు,

అనంతపురం జట్ల జయభేరి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–12 సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల వన్డే మ్యాచ్‌ల్లో నెల్లూరు, అనంతపురం జట్లు విజయభేరి మోగించాయి. శుక్రవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో నెల్లూరు–కడప జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 35 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఆ జట్టులోని యోగాంజనేయులు 69, ఎంఎం గురు ఈక్షిత్‌రెడ్డి 42 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుచిత్‌రెడ్డి 1, శశిధర్‌రెడ్డి 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 31.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఆ జట్టులోని మౌనిష్‌ 56, జాన్సన్‌ 56 పరుగులు చేశారు. కడప జట్టులోని జశ్వంత్‌రెడ్డి 1, యోగాంజనేయులు 1 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనంతపురం–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 35 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ జట్టులోని తౌఫిక్‌ 44, అభినవ్‌ 25 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని గణేష్‌ 3, ఫరీద్‌ నవాజ్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 28.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని మహంత్‌ యాదవ్‌ 39, కెఆర్‌ ప్రజ్వల్‌ 31 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వెంకట్‌నరేన్‌ 3, పీఎన్‌ రాజుల్‌రెడ్డి 2, గోవర్దన్‌ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 25 పరుగులు తేడాతో విజయం సాధించింది.

మౌనిష్‌, నెల్లూరు (56 పరుగులు)

జాన్సన్‌, నెల్లూరు (56 పరుగులు)

యోగాంజనేయులు, కడప (69 పరుగులు)

కారు ఢీకొని కూలీ మృతి  
1
1/5

కారు ఢీకొని కూలీ మృతి

కారు ఢీకొని కూలీ మృతి  
2
2/5

కారు ఢీకొని కూలీ మృతి

కారు ఢీకొని కూలీ మృతి  
3
3/5

కారు ఢీకొని కూలీ మృతి

కారు ఢీకొని కూలీ మృతి  
4
4/5

కారు ఢీకొని కూలీ మృతి

కారు ఢీకొని కూలీ మృతి  
5
5/5

కారు ఢీకొని కూలీ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement