చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు

Feb 22 2026 7:17 AM | Updated on Feb 22 2026 7:17 AM

చైన్‌

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు

బి.కోడూరు : మండలంలోని పాయలకుంట్ల గ్రామంలో శనివారం ఇద్దరు చైన్‌స్నాచింగ్‌ దొంగలను అదే గ్రామానికి చెందిన యువకులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. పాయలకుంట్ల గ్రామ సమీపాన రైస్‌మిల్‌ వద్ద రోడ్డుపై అరటిపండ్ల దుకాణాన్ని ఒక మహిళ గత కొంత కాలంగా నడుపుతోంది. శనివారం ఉదయం పోరుమామిళ్ల నుంచి ఇద్దరు యవకులు ద్విచక్ర వాహనంలో వచ్చి అరటిపండ్ల దుకాణం వద్ద ఆపి.. అరటిపండ్లు కొనుగోలు చేయబోయి ఆమెను ఏమార్చి మెడలో ఉన్న చైన్‌ లాక్కెళ్లబోయారు. ఆమె జాగ్రత్తగా చేతిలో ఉన్న చాకుతో గట్టిగా అరుస్తూ వారిపై తిరగబడి చైన్‌ను విడిపించుకుంది. దీంతో ఆ యువకులు తమ బైక్‌పై పరారయ్యారు. రైస్‌మిల్‌ వద్ద ఉన్న కొంత మంది యువకులు ఈ విషయాన్ని గమనించి బైక్‌లతో వెంబడించి గుండంరాజుపల్లె గ్రామ సమీపాన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకులు నందలూరు గ్రామానికి చెందిన శంకరయ్య, విజయశంకర్‌లుగా గుర్తించారు. వారిపై బద్వేలు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో ఇలాంటి సంఘటనలు మూడుకు పైగా జరిగినప్పటికీ శనివారం యువకులు పట్టుకోవడం గమనార్హం.

ఏయూ ప్రొఫెసర్‌కు

జాతీయ పురసార్కం

రాజంపేట : అన్నమాచార్య యూనవర్సిటీ ఈఈఈ విభాగం అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పసల గోపి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయనను శుక్రవారం ఏయూ వీసీ డాక్టర్‌ సాయిబాబారెడ్డి అభినందించారు. డాక్టర్‌ పసల గోపి విద్యారంగంలో చూపిన అత్యుత్తమ సేవలు, అంకితభావం, నైపుణానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక అథర్‌రేడియన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును మీరట్‌లో ఆరాధయ ఎక్‌ ఎహ్సాస్‌ ఫౌండేషన్‌ అందించింది. అభినందన కార్యక్రమంలో ఏయూ ప్రొఫెసర్‌ పద్మలలిత, ఈఈఈ హెచ్‌వోడీ డాక్టర్‌ పీబీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు  1
1/2

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు  2
2/2

చైన్‌స్నాచర్లను పట్టుకున్న యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement