ఫార్మసీలో ఆధునిక పరిశోధనలు పెరగాలి
రాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని, ఆధునిక పరిశోధనలు పెరగాలని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి పేర్గొన్నారు. శుక్రవారం అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో స్పార్క్‌రిక్సజినిటింగ్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 పత్ర ప్రదర్శనలో ప్రదర్శించే ఆధునిక అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ఐపీఏ అధ్యక్షులు, రాజమండ్రి వికాస్ ఫార్మసీ కళాశాల డైరెక్టరు డాక్టర్ టీవీ నారాయణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔషధ తయారీ కనుగొనాలన్నారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత డాక్టర్ జనార్ధన్ మాట్లాడుతూ పరిశోధనలలో ఆధునికత జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. సదస్సులో తమ పత్ర ప్రదర్శనల ద్వారా అనేక నూతన పరిశోధన మార్గాలు, అధ్యయనం చేసుకునేందుకు దోహద పడతాయన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఔషధ మొక్కల్లో నుంచి వెలికి తీసే ఔషధాలపై, వాటి ప్రయోగాలపై పట్టు సాధించాలన్నారు. సదస్సులో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అన్నమాచార్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒలియర్ జోయల్‌గోనా, డాక్టర్ గోపినాథ్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రంలోని వివిధ కళాశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 200 మంది పత్ర ప్రదర్శనతో , వీడియోలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన డాక్టర్ ఎం.దీప, డాక్టర్ వాసవిదేవి, వై.ప్రదీప్‌కుమార్‌తోపాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. పత్ర ప్రదర్శనలో చక్కటి ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు.
ఫార్మసీలో ఆధునిక పరిశోధనలు పెరగాలి


