భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ

Feb 22 2026 7:17 AM | Updated on Feb 22 2026 7:17 AM

భూమి

భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ

తొండూరు : మండలంలోని సంతకొవ్వూరు పంచాయతీ పరిధిలో గల ఎస్‌.చెర్లోపల్లె గ్రామంలో అన్నదమ్ముల మధ్య పొలం తగాదాపై ఘర్షణ జరిగినట్లు ఎస్‌ఐ ఘన మద్దిలేటి తెలిపారు. శనివారం చెర్లోపల్లె గ్రామానికి చెందిన నారాయణ, వీరయ్య అన్నదమ్ముల మధ్య పొలం తగాదా విషయమై ఘర్షణ జరిగింది. నారాయణ అనే వ్యక్తి వీరయ్య భార్య భవాని, లక్ష్మీ కవితలు ఇంటి వద్ద భూమి విషయమై పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో భవాని, లక్ష్మీ కవితలకు బలమైన గాయాలు కావడంతో వీరిని పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెన్నాలో గుర్తుతెలియని

మహిళ మృతదేహం లభ్యం

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. వచ్చిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం సీఐ ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగమురళి పరిశీలించారు. మృతురాలి వయసు 25 నుంచి 30 మధ్య ఉంటుంది. రెడ్‌ కలర్‌ ఓని, బ్లాక్‌ కలర్‌ లెగ్గిన్‌ ధరించింది. పూర్తి వివరాలు తెలియాల్సింది. వివరాలు తెలిసిన ఎవరైనా 9121100530 నంబర్‌కు తెలపాలని సీఐ కోరారు.

విద్యుదాఘాతంతో

అడవి పంది మృతి

మైదుకూరు : మండలంలోని వనిపెంట అటవీ రేంజ్‌లో విద్యుదాఘాతంతో అడవి పంది మృతి చెందినట్లు అటవీ రేంజ్‌ అధికారి చలపతి నాయుడు శనివారం తెలిపారు. రేంజ్‌ పరిధిలోని గంజికుంట బీట్‌లో పంది మృతి చెందినట్లు తెలియడంతో తాము వెళ్లి పరిశీలించగా కొంత మేరకు పంది మాంసం లభ్యమైనట్లు పేర్కొన్నారు. పంది మృతి చెందిన చోట ఉన్న పొలం యజమానిని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా పొలాలకు విద్యుత్‌ కంచెను వేసి వన్యప్రాణుల మృతికి కారణమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌ఓ హెచ్చరించారు.

భూమి కోసం  అన్నదమ్ముల మధ్య ఘర్షణ  1
1/1

భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement