కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం
శానిటేషన్‌తో పాటు, ఇతర కాంట్రాక్ట్‌లు మారినప్పుడల్లా కార్మికులను వివిధ కారణాలతో తొలగిస్తే ఊరుకునేది లేదు. పద్మావతి వారు కాంట్రాక్ట్‌ను గత ఏడాది అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చినపుడే కాంట్రాక్టర్, ఆయన తరపున సూపర్‌వైజర్లకు పదేపదే కార్మికులను తొలగించరాదనీ, నూతన కార్మికులకు తమ ఎంఓయులోని నిబంధనలను అమలు చేసుకోవచ్చని చెప్పాం. అనవసరంగా 15 మంది శానిటేషన్ సూపర్‌వైజర్లను తొలగించారు. కార్మికుల పక్షాన న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం. – వెంకటసుబ్బయ్య,
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి, రిమ్స్, కడప


