కమిషనర్‌ మనోజ్‌కు పదవీ గండం! | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ మనోజ్‌కు పదవీ గండం!

Feb 21 2026 7:17 AM | Updated on Feb 21 2026 7:17 AM

కమిషనర్‌ మనోజ్‌కు పదవీ గండం!

కమిషనర్‌ మనోజ్‌కు పదవీ గండం!

సాక్షి ప్రతినిధి, కడప: కమిషనర్‌ మనోజ్‌రెడ్డికి పదవీ గండం తప్పడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాల్సి ఉంది. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ద్వారా ఎంపికై వివిధ హోదాల్లో ఉన్న 125 మంది అధికారులకు ఆ తీర్పు వర్తించనుంది. రిక్రూట్‌మెంట్‌ మూల్యాంకనంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఎంపికై న మనోజ్‌రెడ్డి సైతం కమిషనర్‌ నుంచి తాత్కాలికంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

● 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 రిక్రూట్‌మెంట్‌లో మూల్యాంకనంలో అక్రమాలకు ఆస్కారం ఇచ్చారని, నిబంధనలు ఉల్లంఘించారని అర్హులైన తాము ఉద్యోగాలు కోల్పోయామని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గ్రూప్‌–1న ఎంపికలో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. తాజాగా శుక్రవారం అప్పట్లో ఎంపికై న 125 మంది ఉద్యోగులను నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆమేరకు గ్రూప్‌–1 మూల్యాంకన ఎంపికై న అభ్యర్థుల జవాబుపత్రాల ట్యాంపరింగ్‌ జరిగిందా లేదా అని ఫోరెన్సిక్‌ నిపుణులతో పరిశీలన చేపట్టిన తర్వాత సిట్‌ మార్చి 17, 2026 లోపు దర్యాప్తు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గ్రూప్‌–1 మెయిన్స్‌ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వగా, డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. ప్రస్తుతం తాజాగా సిట్‌ విచారణ నేపధ్యంలో 125 మంది గ్రూప్‌–1 అధికారులు ఈ వివాదంలో చిక్కుకున్నారు, వారి ఉద్యోగాల భవిష్యత్తు సిట్‌ నివేదికపై ఆధారపడి ఉండడం విశేషం.

2018 గ్రూప్‌–1 రిక్రూట్‌మెంట్‌పై విచారణకు హైకోర్టు ఆదేశం

అప్పటి వరకు నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement