సీఎం తన క్లాస్‌మేట్ అంటూ కాంట్రాక్టర్ ప్రచారం
పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుకే రాయలసీమజోన్‌లోని అన్ని భోదనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ లభించింది. ఆయన తన సహచరుల ద్వారా, అనుచరుల ద్వారా తాను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు బంధువు, క్లాస్‌మేట్, ఒకే ఊరివారమనీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన గత అక్టోబర్ 2నుంచి కడప రిమ్స్ ఆవరణంలో జీజీహెచ్, మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్, కేన్సర్ హాస్పిటల్, ఐఎంహెచ్, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ దంతవైద్యకళాశాలలలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి విభాగంలోనూ పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉంది. రోజురోజుకు ఐపీ, ఓపీ విభాగాల్లో , ఇతర ప్రదేశాలలో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


