సామాజిక పరివర్తకుడు యోగి వేమన
యోగి వేమన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జేసీ డాక్టర్ నిధి మీనా, ఇతర అధికారులు
వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసి పరివర్తనకు కారణమైన మహనీయుడు యోగి వేమన అని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. సోమవారం యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యోగి వేమన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఘనంగా యోగి వేమన జయంతి
కడప సెవెన్‌రోడ్స్ : వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటమని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సభా భవన్‌లో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటమని పేర్కొన్నారు. అక్షరాయుధంతో సామాజిక విప్లవం తెచ్చిన సహజ కవి వేమన అన్నారు.
సామాజిక పరివర్తకుడు యోగి వేమన


