రూ.7.23 కోట్ల మద్యం తాగేశారు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం వ్యాపారం జోరుగా సాగింది. జిల్లాలో డిసెంబర్ 31న ఒక్కరోజే మందుబాబు రూ.7.23 కోట్లమద్యాన్ని తాగేశారు. వీటిలో లిక్కర్ 9725 కేసులు, బీర్లు 4వేలు కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవి కుమార్ తెలిపారు.
కమలాపురం: కమలాపురంలోని పెద్ద దర్గాలో పూర్వ, స్వర్గీయ పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ హజరత్ సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో 150 కేజీల కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. స్వామి వారి మజార్లపై పూలచాదర్లు సమర్పించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సుంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
మదనపల్లె రూరల్: ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ ఆస్పత్రిలో వినియోగించే మందులు లభ్యం కావడంపై మదనపల్లె డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దాదాఖలందర్ గురువారం విచారణ చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలోని డ్రగ్‌స్టోర్‌ను పరిశీలించారు. స్టాక్ వివరాలు, వినియోగిస్తున్న మందులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రైవేట్ మెడికల్ స్టోర్‌కు వెళ్లి విచారణ చేశారు. ప్రభుత్వ మందులు వారికి ఎలా వచ్చాయనే విషయమై ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మందులు ప్రైవేట్ మెడికల్ షాపులో లభ్యం కావడంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాల యం పరిధిలోని లా కళాశాలల ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ తన చాంబర్లో గురువారం విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సుకు సంబంధించి 2,4,6 సెమిస్టర్లు, ఐదేళ్ల కోర్స్‌కు సంబంధించి 2,4, 6,8 సెమిస్టర్ల ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం వైవీయు వైబ్సెట్ https: //www.yvuexams.in/results.aspx సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు పాల్గొన్నారు.
రూ.7.23 కోట్ల మద్యం తాగేశారు


