అటు అసంపూర్తి భవనం.. ఇటు సమస్యల వలయం
● అధ్వానంగా కడప వ్యవసాయ మార్కెట్ యార్డు
● అవస్థల్లో అన్నదాతలు
పసుపు, వేరుశనక్కాయల క్రయ విక్రయాలు జరిపే పాత భవనం
అసంపూర్తిగా ఉన్న జంబోషెడ్డు
కడప వ్యవసాయం : కడపలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. యార్డుకు వచ్చే రైతులకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. వీటితోపాటు మరుగుదొడ్లు కూడా లేవు. దీంతోపాటు మార్కెట్‌యార్డులో రైతులు సేద తీరేందుకు సరైన వసతి లేక బస్తాలపైన, కింద పడుకోవాల్సి వస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తెచ్చి విక్రయాలు జరుపుకునే పసుపు, వేరుశనక్కాయలకు సంబంధించిన యార్డు భవనం కూడా దెబ్బతింది. యార్డుభవనం పైకప్పు దెబ్బతిని పెచ్చులూడుతోంది. దీంతో భయం భయంగా ఉత్పత్తులు ఆమ్ముకునే పరిస్థితి నెలకొంది. దీనికితోడు నూతనంగా నిర్మిస్తున్న జంబోభవనం నిర్మాణం కూడా ఏళ్ల తరబడి అసంపూర్తిగానే ఉంది. ఇప్పటికై నా మార్కెట్‌యార్డు అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న జంబోషెడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయడంతోపాటు పాత భవనానికి కూడా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
అటు అసంపూర్తి భవనం.. ఇటు సమస్యల వలయం
అటు అసంపూర్తి భవనం.. ఇటు సమస్యల వలయం


