● పకడ్బందీ ఏర్పాట్లు.. కనిపించని ఫీట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, నిర్మానుష్యంగా కడప నగర ప్రధాన రహదారులు
కడప నగరంలో 2026 నూతన సంవత్సర వేడుకలను బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఘనంగా, ఉత్సాహంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరుపుకున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ యు. సదాశివయ్య తమ సిబ్బందితో కలిసి భారీగా బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు కడప నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో యువత అతివేగంగా బైకులపై వెళుతూ జనాన్ని భయభ్రాంతులను చేయడం, రోడ్లపై బైకు రేసులు, విన్యాసాలు లాంటి వికృత చేష్టలు కనిపించలేదు. పోలీసులు తీసుకున్న పకడ్బందీ చర్యలతో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగడంపై ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కడప అర్బన్
● పకడ్బందీ ఏర్పాట్లు.. కనిపించని ఫీట్లు


