ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
● పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
● కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
కడప అర్బన్ : వై.ఎస్.ఆర్. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా దేవదాయ శాఖకు చెందిన వేదపండితులు జిల్లా ఎస్పీకి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఎస్పీ నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పి, కేక్ అందజేశారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, స్పెషల్ బ్రాంచి, డీసీఆర్‌బీ, ఏ.ఆర్, జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బంది, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు సబ్ డివిజన్ వారీగా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను, పూలమొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని, పోలీసుశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొనే విధంగా సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌తో 2026లో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ద్విచక్ర వాహనాలలో వెళ్లేటప్పుడు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాల కు చేరుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా జీవించాలని, పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ(ఏ.ఆర్) బి.రమణయ్య, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రా మనాథ్ హెగ్డే, స్పెషల్ డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఎ. వెంకటేశ్వర్లు, భావన, జి.రాజేంద్ర ప్రసాద్, వెంకటే శ్వర రావు, అబ్దుల్ కరీం, బాలస్వామి రెడ్డి, జిల్లాలోని సీఐ లు, ఎస్‌ఐలు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


