
పెద్ద దర్గాకు ఉత్సవ శోభ
కడప సెవెన్‌రోడ్స్ : భక్తుల పాలిట కొంగుబంగారమై నిలుస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక సూఫీ పుణ్య క్షేత్రమైన కడప పెద్దదర్గాకు ఉరుసు శోభ చేకూరింది. ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవం, సోమవారం ఉరుసు, మంగళవారం తహలీల్ ఫాతెహా నిర్వహిస్తారు. ఉరుసురోజు ఖవ్వాలీ కచేరీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దర్గాతోపాటు దర్గా ఆవరణం విద్యుద్దీపాలతో కాంతులీనుతూ భక్తులను ప్రత్యేకంగా ఆకర్శిస్తోంది.
నేటి నుంచి ఉరుసు