
సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి
ఫిజికల్ డైరెక్టర్లుగా ఎంపిక
పల్లె నుంచి ఫస్ట్ ర్యాంకు వరకు..
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ –2025లో అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమైంది. ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందుతాయని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్‌లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయా ల్సి ఉంటుంది, అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తప్పనిసరిగా హాజరు కావాలి. అలా హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల
పరిశీలన కేంద్రంగా ఎంపిక...
డీఎస్పీ అభ్యర్థులకు త్వరలో జరగబోయే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యాశాఖ కడప బాలాజీ నగర్‌లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యాశాఖ, రెవెన్యూశాఖ అధికారులను 68 మందితో 17 టీముల సిద్ధం చేశారు. వీరితోపాటు 30 మంది వలంటీర్లును కూడా అందుబాటులో ఉంచారు.
జమ్మలమడుగు: ఎర్రగుంట్ల జిల్లా పరిషత్‌లో చదువుకున్న నలుగురు విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్లుగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయుల రెడ్డి పేర్కొన్నారు. సెలెక్టు అయిన వారిలో చంద్రకాంత్ మూడవర్యాంకు, తాజుద్దీన్ 20వ ర్యాంకు, ఆరిఫ్ మహమ్మద్ 25, జగదీష్‌కుమార్ 56 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.
డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల
కడపలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉపాధ్యాయ ఉద్యోగాలు
ఓ మారుమూల పల్లెలో నివాసం.. పైగా గృహిణి.. ఇద్దరు పిల్లలు. అలాగని ఆమె అక్కడితో ఆగి పోలేదు. తన ఇద్దరు పిల్లల పోషణ చూసుకుంటూనే ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుత డీఎస్సీ సోషియల్ సబ్జెక్టులో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆమే దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామానికి చెందిన అప్పల్‌రెడ్డి భాగ్యలక్ష్మి. ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. బాగ్యలక్ష్మి భర్త సునీల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి

సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి