
ఆంధ్రకేసరి.. మన్నించాలి మరి!
కూటమి నేతల మాటకు.. చేతలకు పొంతనే ఉండదు. ప్రచార ఆర్భాటాలు మినహా ఆచరణలో చేసేదేమీ ఉండదు. ఇదిగో కడప నగరం ఏడురోడ్ల కూడలిలోని మన ప్రకాశం పంతులుగారి నిలువెత్తు విగ్రహమే ఇందుకు సాక్ష్యం. స్వాతంత్య్ర సంగ్రామంలో తన సర్వస్వాన్ని ధార పోసిన మహోన్నత నాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పింది. ఆచరణలోకి వచ్చేసరికి చేతులు దులిపేసుకుంది. సమయం లేదో.. ఉత్సవంగా చేయాలన్న మనసే రాలేదోగానీ అటు అధికారులు.. ఇటు నాయకులు జయంతి వేళ ఒక్క దండ కూడా వేసింది లేదు. పాత పూల దండతోనే దర్శనం ఇస్తున్న విగ్రహాన్ని చూసిన స్థానికులు ‘మన్నించు.. పంతులు గారూ’ అంటూ మౌనంగా వెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప