
గండి అంజన్నకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పూజలు
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామిని శ్రావణ మాసం చివరి శనివారం సాయంత్రం కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ ఫలంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవీబాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రామాంజులరెడ్డి, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రుషి కేశవరెడ్డి, స్థానిక సర్పంచ్ నరసింహులు, శేషారెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.