కడప అగ్రికల్చర్: ఖరీఫ్‌లో సాగు చేసే పంటల వివరాలను గుర్తించేందుకు చేపట్టిన ‘ఈ క్రాప్’ నమోదుకు ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుకోవాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా ఈ – పంట నమోదు చేసుకుని ఉండాల్సిందే. లేకుంటే వ్యవ సాయ పంటలకు సంబంధించిన ప్రభుత్వ పథ కాలు వర్తించవు. ఈ పక్రియ ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా జరుగుతుంది.
వ్యవసాయ, రెవెన్యూ శాఖల
సమన్వయంతో...
జిల్లాలో వ్యవసాయ, రెవెన్యూశాఖల సమన్వయంతో ఈ క్రాపు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతు లు అతివృష్టి, అనావృష్టితో ఎప్పకప్పుడు నష్ణపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు పరిహారం పొందేందుకు అధికారులు చుట్టూ తిరిగేవారు. ఈ క్రాపు నమోదుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పారదర్శకత కోసం గత వైస్సార్ ప్రభుత్వం జియో ఫిన్సింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో ఖచ్చితంగా రైతు పొలం వద్దకే వెల్లి వివరాలను నమోదు చేస్తేనే యాప్‌లో నమోదు అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం చేరుతుంది. ఈ– పంట ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందనున్నాయి.
వర్షాభావంతో తగ్గిన ఆరుతడి పంటలు...
జిల్లాలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న , మిను ము పంటలు అక్కడక్కడ తెడతెరిపిలేని వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఈ పంటలకు ఈ పంట నమోదు చేస్తేనే నష్టపరిహారం అందే అవ కాశం ఉంది. రైతులందరూ తప్పకుండా తాము సాగుచేసిన ప్రతి పంటకు ఈ పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో ఈ క్రాపు నమోదు పరిస్థితి ఇలా...
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటల సాధారణ సాగు 309253.88 ఎకరాలుకాగా ఇప్పటి వరకు 58878.08 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 19వ తేదీ వరకు 30833.22 ఎకరాల్లో ఈ పంటనమోదు పూర్తరుంది. ఈ క్రాపు నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది.
ప్రతి రైతు ఈ క్రాపు
చేయించుకోవాలి
ఖరీప్ సీజన్‌లో పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఖచ్చితంగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. – చంద్రానాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన ఈ పంట నమోదు
సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు
ఈ క్రాప్ నమోదు షురూ