
పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం
బాలాలయంలో స్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠ దర్శనానికి క్యూలో నిలిచిన భక్తులు
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశ కింద రూ.15 లక్షలతో బాలాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, అనంతరం తులాలగ్నంలో బాలబింబ ప్రతిష్ఠ, బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ భట్టర్, మయూరం కృష్ణమోహన్, తివిక్రమ్, కృష్ణ తరుణ్ నిర్వహించారు. అనంతరం బాలాలయంలో వెలిసిన స్వామి, అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమాలను టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం