సెప్టెంబర్‌ 11, 12వ తేదీల్లో కళా ఉత్సవ్‌–2025 పోటీలు | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 11, 12వ తేదీల్లో కళా ఉత్సవ్‌–2025 పోటీలు

Aug 21 2025 7:16 AM | Updated on Aug 21 2025 2:09 PM

కళా ఉత్సవ్‌–2025 పోటీల పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ‌

కళా ఉత్సవ్‌–2025 పోటీల పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ‌

ఐటీఐలో ప్రవేశానికి 26 తుది గడువు మైనార్టీ సెల్‌ కార్యాలయంలో గోల్‌మాల్‌ ! ఏఎఫ్‌యూలో 25న కౌన్సెలింగ్‌ డీ ఫార్మసీ ప్రవేశాలకు గడువు పొడిగింపు సెప్టెంబర్‌ 11, 12 తేదీల్లో కళా ఉత్సవ్‌ పోటీలు

రాయచోటి: ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌–2025 పోటీలను రాయచోటి డైట్‌ ప్రాంగణంలో సెప్టెంబర్‌ 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధి కారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్‌లో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గాత్ర, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి విభాగాలలో విద్యార్థుల ప్రతి భను వెలికితీయడం, కళా రూపాలను ప్రోత్స హించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9,10, 11,12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులను వివరించారు. ఇతర వివరాలకు జిల్లా నోడల్‌ అధికారి మడితాటి నరసింహారెడ్డి, ఫోన్‌ నెంబరు. 9440246825లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు తిరుపతి శ్రీనివాస్‌, శివ భాస్కర్‌, వెంకట సుబ్బారెడ్డి, గిరిబాబు యాదవ్‌, కేదర్నాథ్‌, శివప్రసాద్‌, మోహన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశానికి 26 తుది గడువు 

కడప ఎడ్యుకేషన్‌: కడప ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో మూడవ దఫా అడ్మిషన్స్‌కు ఈ నెల 26తో గడువు ముగుస్తుందని డీఎల్‌టీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రత్నరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐలో ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, మిషనిస్టు, మోటార్‌ మెకానిక్‌, టర్నర్‌, డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌తోపాటు కార్పెంటర్‌ ట్రేడ్‌లలో సీట్లు ఉన్నాయని వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ సర్టిఫికెట్స్‌, ఒక ఫొటో తదితర వివరాలతో ఐటీఐ సర్కిల్‌లోని ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఏడి రత్నరాజు తెలిపారు. వివరాలకు 85559 58200, 99482 78611 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కడప అర్బన్‌: కడప నగరంలోని జిల్లా మైనార్టీ సెల్‌ విభాగం కార్యాలయంలో గతంలో జిల్లా అధికారిగా పనిచేసిన షేక్‌ ఇమ్రాన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన మస్తాన్‌వల్లీతో కలిసి రూ. 2కోట్ల 48 లక్షల మేరకు నిధులను స్వాహా చేసినట్లు ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న షేక్‌ హిదాయతుల్లా ఒన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పై ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ఒన్‌టౌన్‌ సీఐ బి. రామకృష్ణ తెలియజేశారు.

కడప ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ వైస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 25న కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని విశ్వ విద్యాలయం వీసీ విశ్వనాథకుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా బీఎఫ్‌ఏ (ఫోర్‌ ఇయర్స్‌ డిగ్రీ) ఫైన్‌ ఆర్ట్స్‌ (యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, శిల్పం, బి.డెస్‌ ఇంటీరియర్‌ డిజైన్‌) కోర్సులకు కౌన్సెలింగ్‌ ఉంటుదని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో 25వ తేదీ తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా దర ఖాస్తు చేసుకోని వారు కూడా డైరెక్ట్‌ అడ్మిషన్స్‌ కోసం ఒరిజినల్‌ (అసలు ధృవపత్రాలు) సర్టిఫికెట్స్‌ తో హాజరుయి అదే రోజు అడ్మిషన్స్‌ పొందవచ్చుని తెలిపారు. సమాచారం కోసం www.ysrafu.ac.inను సందర్శించాలని వీసీ విశ్వనాథ్‌కుమార్‌ తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డి ఫార్మసీ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పొడగించినట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. ఈ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వారికి వందశాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తప్పక పదో తరగతి, ఇంటర్‌ మార్కుల జాబితాలు, అభ్యర్థి ఫొటో, సంతకం, ెపేరెంట్స్‌ సంతకం, స్టడీ సర్టిఫికెట్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్స్‌ ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేసి రూ, 400 ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. వివరాల కోసం 94401 44057, 98853 55377 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement