
అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు
ప్రొద్దుటూరు క్రైం: నూతన బార్ పాలసీ ప్రకారం ఇక నుంచి బార్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఎస్ రవికుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎకై ్సజ్ స్టేషన్‌కు వచ్చారు. స్థానికంగా ఉన్న పాత బార్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. కడప జిల్లాలో 29, అన్నమయ్య జిల్లాలో 12 బార్లు ఉన్నాయన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 28న బార్లకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. గతంలో ప్రొద్దుటూరులోని బార్లకు లైసెన్స్ ఫీజు రూ. 1.45 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించినట్లు చెప్పారు. సమయ పాలన పాటించని మద్యం షాపులు, బార్లపై చర్యలు తీసుకుంటామన్నా రు. ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్న ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డిని అభినందించారు.