
●2 బార్లకు నోటిఫికేషన్ విడుదల
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలో గీత కులాలకు సంబంధించిన 2 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప కార్పొరేషన్ పరిధిలో –1, ప్రొద్దుటూరు మున్సి పాలిటీలో –1 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుం ఫీజు నాన్ రీఫండబుల్ రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 5.10 లక్షలు చెల్లించాలన్నారు. దరఖాస్తులను ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల చేసుకోవాలన్నారు. 30న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపికై న అభ్యర్థులకు సమాచారం అందిస్తామన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు.