
పులకించిన గండిక్షేత్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి శ్రావణ మాసం నాలుగవ శనివారోత్సవం సందర్భంగా భక్తులతో పులకించిపోయింది. రాయలసీమ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తుల కోసం దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయకమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణ తేజ పాలకమండలి సభ్యులతో పాటు, ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు. చక్రాయపేట ప్రభుత్వ వైద్యాధికారి వాణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, అర్చకులు కేసరి, రాజారమేష్, రఘుస్వామి, వేదపారాయణం రామ మోహణ శర్మ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. గండి వీరాంజనేయ స్వామిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు జడ్జి జింకా రెడ్డిశేఖర్ తదితర ప్రముఖులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

పులకించిన గండిక్షేత్రం