
జిల్లాలో జోరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శని వారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. ఇందులో భాగంగా దువ్వూరులో అత్యధికంగా 32.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే రాజుపాలెంలో 30, కొండాపురంలో 28.2, ఖాజీపేట, మైలవరంలలో 23.6, బి.మఠంలో 19.8, ప్రొద్దుటూరులో 19, జమ్మలమడుగులో 16.4, చాపాడు లో 15.6 , మైదుకూరులో 15, బద్వేల్‌లో 14.2 ,పోరుమామిళ్ల 12.2, ఎర్రగుంట్లలో 11.8, చెన్నూరులో 11, బి.కోడూరులో 10.6, అట్లూరులో 9.8, వల్లూరు, మైదుకూరు, ముద్దనూరులలో 8.4, పెద్దముడియంలో 7.4 , గోపవరంలో 6.4 , సిద్దవటంలో 6.2, కడపలో 4.4 ,కమలాపురంలో 3.8, ఒంటిమిట్టలో 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
కడప కోటిరెడ్డిసర్కిల్: వరుస సెలవుల నేపఽథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం రాత్రి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఈ రైలు (07097) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌కు ఉదయం 10.00 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఇదే రైలు (07098) సికింద్రాబాదులో సోమవారం సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు చేరుతుందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం పంపిణీ సంస్థ(ఏపీఎస్‌పీడీసీఎల్) పరిధిలోని 10 జిల్లాలలో వివిధ అంశాలలో వైఎస్సార్ కడప జిల్లా అత్యుత్తమ ప్రగతిని కనబరించి ప్రథమ స్థానం సాధించింది. శుక్రవారం తిరుపతిలోని కార్పొరేట్ ఆఫీసులో జరిగిన 79వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఆ సంస్థ ఎండీ కె. సంతోషరావు చేతుల మీదుగా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.రమణ ప్రశంసా పత్రం అందుకున్నారు. కలెక్టర్ చెరుకురి శ్రీధర్ ప్రకటించిన ఉత్తమ జిల్లా అధికారుల జాబితాలో కూడా ఎస్‌ఈ రమణకు చోటు లభించింది.

జిల్లాలో జోరు వర్షం