
● కనిష్ట స్థాయికి పడిపోయిన వేరుశనగ...
ప్రధాన పంటగా దశాబ్దాల పాటు పేరుగాంచిన వేనుశనగ సాగు ఈ సారి కనిష్ట స్థాయికి పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కూటమి ప్రభత్వం సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవడం తదితర కారణాలతో వేరుశనగ పంటసాగుకు రైతన్నలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ ఖరీఫ్‌లో 5976 హెక్టార్లలో అంచనా వేయగా చివరకు 983.88 హెక్టార్ల వద్ద సాగు నిలిచిపోయింది. అలాగే పత్తి పంట సాధారణ సాగు 24,036 హెక్టార్లుకాగా ఇప్పటివరకు 3524.27 హెక్టార్లలో, సోయాబీన్ సాధారణసాగు 1030 హెక్టార్లు కాగా 47 హెక్టార్లలో, మినుము 3806 హెక్టార్లకు గాను 1502 హెక్టార్లలో సాగయ్యాయి. అది కూడా నీటి వసతి కింద సాగు చేశారు.