కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో క్రిస్టియన్ మతానికి చెందిన వివాహాలను నిర్వహించి అందుకు తగిన వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ముగ్గురు పాస్టర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట పరిధిలో ఆచారాల ప్రకారం మతపరమైన వివాహాలు నిర్వహించడానికి వారికి అధికారం కల్పించారు. నగరంలోని రాజారెడ్డివీధికి చెందిన రెడీమర్ చర్చికి చెందిన పాస్టర్ డాక్టర్ భవనాసి సుధీర్, పులివెందుల నగరిగుట్టకు చెందిన రాక్ ప్రేయర్ హౌస్ చర్చి పాస్టర్ కోట్ల ఇమ్మాన్యుయేల్, సాలేము ప్రేయర్‌హౌస్ చర్చి పాస్టర్‌పాదాల ఏసయ్యను నియమించారు.పై ముగ్గురు పాస్టర్లు చట్టప్రకారం క్రైస్తవ యువతీ యువకులకు వివాహం జరిపించి, వివాహ ధృవీకరణ పత్రాలు జారీచేసే అఽధికారం కల్పించారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సి.శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
20న విచారణకు హాజరవుతా
జమ్మలమడుగు : పోలీసుల విచారణకు ఈనెల 20వతేదీన హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి తన లాయర్ ద్వానా నోటీసులు పంపించారు. ఈనెల 12వతేదీన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి ఎర్రగుంట్ల మీదుగా కడపకు తరలిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎంపీని ఎక్కడకు తరలిస్తున్నారంటూ అడ్డుకున్నారు. ముందస్తు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేయడం ఎమిటంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని 189/21 సెక్షన్,191–3,126–2,132(353),351(2) సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిడిజివ్వి గ్రామానికి సీఐ నరేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని విచారణ నిమిత్తం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం కండీషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుధీర్‌రెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో తాను 16వతేదీన పోలీసుల విచారణకు హాజరు కాలేనని, ఈనెల 20వతేదీన హాజరవుతానంటూ తన తరపున న్యాయవాది ద్వారా నోటీసులను పంపించారు.