
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగధనుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. వారందరి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలని, ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ఇలాగే భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. జాతీయ నాయకుల ఆశయాల మేరకు దేశాభివృద్ధి కోసం మన వంతు కృషి చేయాలని కోరారు.దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాక సురేష్ కుమార్, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, జిల్లా నాయకులు పులి సునీల్ కుమార్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఏ కరిముల్లా, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్, జాషువా,త్యాగరాజు, దాసరి శివ, వేణుగోపాల్‌నాయక్, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, పత్తిరాజేశ్వరి, బి. మరియ తదితరులు పాల్గొన్నారు.