
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామం నుంచి బుల్లెట్‌పై ప్రొద్దుటూరుకు వెళ్తుతున్న ఫయాజ్(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పని నిమిత్తం ఫయాజ్ ప్రొద్దుటూరుకు వెళుతుండగా మణిపూర్‌కు చెందిన గీతా సర్కస్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు స్కూటర్‌లో ఎదురుగా వస్తుండటంతో ఆదుపు చేయలేక బుల్లెట్ టీవీఎస్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఫయాజ్ పోలీసులు తెలిపారు. గీతా సర్కస్‌కు చెందిన వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
గుర్తు తెలియని వ్యక్తి..
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టీబీ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందిండంతో శుక్రవారం త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన మృతుడికి సుమారు 50 ఏళ్ల లోపు ఉంటాయని సీఐ తెలిపారు. అతను అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వ్యక్తులు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కోరారు.
డంపింగ్‌యార్డు వద్ద..
– మరొకరికి గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై మద్దిమడుగు సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ సమీర్ అనే వ్యక్తి మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు గువ్వల చెరువుకు చెందిన సమీర్ మరొకరితో కలిసి బైక్ పైన కడప వైపుకు వస్తుండగా కడప నుండి డంపింగ్ యార్డ్‌కు వెళ్తున్న చెత్త సేకరణ వాహనం డంపింగ్ యార్డ్ సమీపంలో రహదారిపై ఢీకొనడంతో షేక్ సమీర్ మృతి చెందినట్లు, మరొకరు గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కోనేరులో ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
అట్లూరు : లంకమల అభయారణ్యంలో వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న కోనేరులో సరదా కోసం ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతైనట్లు స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. వివరాలిలా.. మైదుకూరుకు చెందిన నలుగురు వ్యక్తులు శుక్రవారం రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కోనేరులోకి నలుగురు వ్యక్తులు ఈతకు దిగారని, వారిలో ముగ్గురు బయటికి రాగా నాల్గవ వ్యక్తి హబీబుల్లా (36) గల్లంతయ్యాడు. ఈ మేరకు సమాచారం అందడంతో బద్వేలులోని అగ్నిమాపక సిబ్బందిని తీసుకెళ్లి రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పాటు వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందికరం కావడంతో వెనుతిరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి శనివారం గాలింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎస్‌ఐతో పాటు స్టేషన్ రైటర్ నాగేశ్వర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి