
ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి శుక్రవారం ‘ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి నో’ శీర్షికన వార్తను ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన రాష్ట్ర ప్రభత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘాట్ రూటులో ప్రయాణించే బస్సులో నిలబడి ప్రయాణించకుండా బస్సు కెపాసిటీ మేరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, గ్రీన్ సప్తగిరి బస్సులకు సీ్త్ర శక్తి పథకం వర్తించదని సూచించారు.
దేశ ప్రగతి కోసం పాటుపడదాం
– వైవీయూ కులసచివులు ఆచార్య పి.పద్మ
కడప ఎడ్యుకేషన్ : భారతావని సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ పురోగతికి విశ్వవిద్యాలయాల ఆలోచనలు, ఆవిష్కరణలు దోహదమయ్యేలా విద్యార్థులు పరిశోధకుల కృషి జరగాలని కులసచివులు ఆచార్య పి.పద్మ ఆకాంక్షించారు. శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం పరిపాలన భవనం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కులసచివులు పి.పద్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేశారు. ఆమెతో పాటు యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ శాఖ సంచాలకులు డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆచార్య పుత్తా పద్మ విశ్వవిద్యాలయ ఉపకులపతి పంపిన సందేశాన్ని వినిపించారు. అధ్యాపకులుగా వృత్తిపట్ల అంకితభావంతో ఉంటూ విలువలను, జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతులు