
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగకరం
● రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్
● జిల్లాలో ఘనంగా ప్రారంభమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమలు చేస్తున్న ‘సీ్త్ర శక్తి పథకం’ మహిళలకు ఉపయోగకరమని, ఈ పథకం వారికి రె ట్టింపు స్వేచ్ఛను ఇస్తుందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూఖ్ అభివర్ణించా రు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీ్త్ర శక్తి’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవా రం కడప ఆర్టీసీగ్యారేజీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏపీఎస్ ఆర్టీసి కి చెందిన సిటీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు పూర్తి ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. పథకంలో భాగంగా మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కేవలం మహిళలకే కాకుండా మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం రోజుకు 2.16 వేల కిలోమీటర్ల చొప్పున బస్సులు ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చడం జరుగుతుందన్నారు. బస్ స్టేషన్ మేనేజర్లు/ కంట్రోలర్స్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకముగా ప్రవర్తించేలా ఆర్టీసీ యాజమాన్యం ద్వారా ప్రతి ఒక్కరికీ సూచించామన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఈ అవకాశం వారి కుటుంబ ఆర్థిక స్వావలం మనకు ఎంతో చేయూతని ఇస్తుందన్నారు.
ఆర్‌ఎంకు చురకలు :
ఎమ్మెల్యే మాధవీరెడ్డి కడప నగరంలో ఏడాది కింద తాను నగరంలో సిటీ బస్సులను నడపాలని సూచించామని, ఈ విషయంగా పట్టించుకోకపోవడంపై ఆర్‌ఎం గోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీతోపాటు సీఎం దృష్టికి తీసుకు వెళతామని తెలిపారు. ఇప్పటికై నా కనీసం 4 బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.