
పెన్నానదిలో చిక్కుకున్న వృద్ధ దంపతులు
ప్రొద్దుటూరు క్రైం : పెన్నానదిలో చిక్కుకున్న ఇరువురు వృద్ధులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రేగుళ్లపల్లె గ్రామానికి చెందిన గండి చిన్న సుబ్బరాయుడు, ఆయన భార్య నారాయణమ్మలు ఆదివారం పెన్నానదిలోకి వెళ్లా రు. అయితే పెన్నా నదికి మైలవరం నీరు వదలడంతో నీటి ప్రవాహం ఒక్క సారిగా పెరిగింది. దీంతో వృద్ధ దంపతులు నీళ్లలో చిక్కుకున్నారు. వారిని స్థా నికులు గుర్తించి డయల్ 100కు ఫోన్ చేశారు. రూ రల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు. బోటు ద్వారా నీళ్లలోకి వెళ్లి వృద్ధులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సురక్షితంగా కాపాడిన పోలీసు,
అగ్నిమాపక సిబ్బంది