అదనపు కట్నం వేధింపులపై కేసు
మదనపల్లె రూరల్ : అదనపు కట్నం, కానుకల కోసం వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదుచేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. మదనపల్లె పట్టణం తాళ్లసుబ్బన్న వీధికి చెందిన నజీరుల్లా, జుబేదా దంపతుల కుమార్తె ముస్కాన్(22)ను కర్ణార్నాటక ఆర్‌కే.పురంకు చెందిన జలీల్‌అహ్మద్, షహీనా దంపతుల కుమారుడు షేక్ సల్మాన్‌కు ఇచ్చి 2022లో వివాహం జరిపించారు. ఏడాది నుంచి భర్త సల్మాన్, అత్త షహీనా, మేనత్త ఘాజియాలు అదనపు కట్నంతో పాటు బైక్ కొనివ్వాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భరించలేక నెలరోజుల క్రితం ముస్కాన్ పుట్టింటికి వచ్చేసింది. విషయం తల్లిదండ్రులకు తెలిపి వారి సహాయంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితులు ముగ్గురిపై కేసు నమోదుచేసి హెడ్‌కానిస్టేబుల్ చంద్రరాజు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అన్నమాచార్య యూనివర్సిటీ
ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు యూనవర్సిటీ ప్రొచాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి తెలిపారు. స్ధానిక ఏయూలోని తన చాంబరులో ఏయూఈటీ –2025 మొదటి దశ ప్రవేశ ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూఈటీ ప్రవేశపరీక్ష ఈనెల 15న నిర్వహించామన్నారు. పరీక్షను మొత్తం 1908 మంది విద్యార్ధులు రాశారన్నారు. అందులో 1239 మంది విద్యార్ధులు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన విద్యార్ధుల కోసం జూన్ 5, 6, 9, 10 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అన్నమచార్య యూనివర్సిటీ జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబా, రిజిస్టార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ నారాయణ, డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుడి కోసం వెళ్లి
అనంత లోకాలకు..
కురబలకోట : కురబలకోట మండలం జంగావారిపల్లె సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో రాయచోటికి చెందిన యువకుడు షేక్ మహమ్మద్ నవాజ్ (23) మృతి చెందాడు. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు..రాయచోటికి చెందిన సుహేల్ (24) కువైట్‌లో పని చేస్తూ స్వగ్రామం రాయచోటికి రావడానికి శుక్రవారం బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. ఇతన్ని తీసుకు రావడానికి రాయచోటికి చెందిన ఇతని స్నేహితులు మహమ్మద్ అలీ ఖాన్ (23), డ్రైవర్ ముజిమిల్ (24), ఖాదర్ బాషా (24), షేక్ మహమ్మద్ నవాజ్ (24) వెళ్లారు. వీరి స్నేహితుడు సుహేల్‌తో పాటు కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో మండలంలోని జంగావారిపల్లె వద్ద రోడ్డు డివైడర్‌ను డీకొంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనలో షేక్ మహమ్మద్ నవాజ్ (24) మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృత దేహాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. స్నేహితుడి కోసం వెళ్లి రెప్పపాటున జరిగిన ప్రమాదంలో ఇతను మృతి చెందడం పట్ల రాయచోటిలో తీవ్ర విషాదం నెలకొంది.
సాగులో శాసీ్త్రయత
పెంపొందించుకోవాలి
– భారత నూనె గింజల
పరిశోధనా శాస్త్రవేత్త ఖురేషి
నందలూరు : రైతులు సాగులో శాసీ్త్రయత పెంపొందించుకోవాలని తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధనా శాస్త్రవేత్త ఖురేషి సూచించారు. శుక్రవారం మండలంలోని లేబాక, నల్లతిమ్మయ్యగారిపల్లె గ్రామాల నందు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ద్వారా రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త మానస మాట్లాడుతూ మామిడి తోటల పెంపకం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి రామకృష్ణరాజు మాట్లాడుతూ మండలంలోని ప్రధాన పంట వరి పైరు గురించి వివిధ రకాల విత్తనాలు నారుమడి పెంపకం, ప్రధాన పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షక్షణ చర్యల గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి మల్లిఖార్జున మాట్లాడుతూ రైతులందరూ విశిష్ట నమోదు సంఖ్య తీసుకోవాలని, ఇప్పటికీ తీసుకోని వారు త్వరగా నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వం వారిచే రైతులకు ఇచ్చే పంట ద్వారా వారు వేసిన పంటను నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సురేష్‌బాబు, వైపి గిరీష్‌కుమార్, పామాయిల్ పంట అభివృద్ధి అధికారి కొండారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
అదనపు కట్నం వేధింపులపై కేసు
అదనపు కట్నం వేధింపులపై కేసు
అదనపు కట్నం వేధింపులపై కేసు


