వైఎస్సార్‌సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ గల్ఫ్, కువైట్ కమిటీల సేవలు ప్రశంసనీయమని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు అన్నారు. మూడోసారి గల్ఫ్ కన్వీనర్‌గా ఎన్నికై గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, దుబాయ్‌లలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దిగ్విజయంగా నిర్వహించి కడపకు విచ్చేసిన బీహెచ్ ఇలియాస్‌ను వారు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇలియాస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మునీర్ సిద్ధిఖీ, నెల్లూరు జిల్లా యువజన విభాగం కార్యదర్శి షేక్ అలీం, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హలీమ్, సయ్యద్ జమీర్, షేక్ సలీం పాల్గొన్నారు.


