వాట్సాప్ బాట్ ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు
కడప కల్చరల్ : వాట్సాప్ బాట్ ద్వారా ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపు సౌకర్యం మే 9 నుంచి అందుబాటులోకి వచ్చిందని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్‌సీ రవికుమార్ తెలిపారు. ఇప్పటిదాకా ఎల్‌ఐసీ కస్టమర్ పోర్టల్‌పై 2 కోట్ల 20 లక్షల మంది తమ పాలసీలను నమోదు చేసుకున్నారని, ప్రతిరోజు మూడు లక్షల మంది ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ వాట్సప్ బాట్ సౌకర్యం అదనంగా అందుబాటులోకి రావడంతో పాలసీదారులు ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు. పాలసీలపై ప్రీమియంలు చెల్లించవచ్చన్నారు. 8976862090 వాట్సాప్ నంబరుకి ఏజీ అని మెసేజ్ చేస్తే, మన పాలసీలపై చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వాట్సాప్ బాట్ నుంచే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇదే కాకుండా ఎల్‌ఐసీకి సంబంధిన మరో 14 సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాట్సాప్ బాట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన పాలసీదారులను కోరారు.


