జగన్ హయాంలో శంకుస్థాపన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రౌన్ లైబ్రరి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. టెండర్లు పూర్తయ్యాయి. పనులు చేపట్టకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. మళ్లీ శంకుస్థాపన చేసిన తర్వాతే పనులు చేపట్టాలని అధికారులకు అడ్డుతగులుతున్నారు. పైగా తన పేరే ప్రధానంగా కన్పించాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముప్పు తిప్పలు పెడుతున్నారు. –ఎం సుబ్బరాయుడు,
డివిజన్ ఇన్‌ఛార్జి, ఎర్రముక్కపల్లె
నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు
చంద్రబాబు సర్కార్ నుంచి కొత్తగా నిధులు తీసుకవచ్చింది లేదు. మంజూరైన పనులకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి ప్రచారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నిధులు తీసుకురాకపోగా, నిస్సిగ్గుగా శిలాఫలకం వేసుకునేందుకు తాపత్రయం పడుతున్నారు. దాంతో బ్రౌన్ లైబ్రరి శంకుస్థాపనకు రెండు శిలాఫలకాలు తయారు చేయించాల్సిన దుస్థితి యూనివర్శిటీ అఽధికారులకు పట్టింది. –వెల్లాల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ అధ్యక్షుడు
జగన్ హయాంలో శంకుస్థాపన


