నేడు కొలువుతీరనున్న గంగమ్మ | - | Sakshi
Sakshi News home page

నేడు కొలువుతీరనున్న గంగమ్మ

May 1 2025 2:09 AM | Updated on May 1 2025 2:09 AM

నేడు

నేడు కొలువుతీరనున్న గంగమ్మ

రైల్వేకోడూరు అర్బన్‌ : రైల్వేకోడూరు పట్టణంలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోడూరు గంగమ్మ జాతర నేడు గురువారం జరగనుంది. ఉదయం 5 గంటలకు పొట్టి శ్రీరాముల వీధిలోని అంకాలమ్మ గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. గంగమ్మ మిట్టలో గంగమ్మ కొలువుతీరనుంది. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే ఉదయం వసంతోత్సవంతో గంగమ్మను ఉంగరాల నగర్‌ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఈ ఏడాది ఎటువంటి వీఐపీ పాస్‌లు లేకుండా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. జాతర నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు డప్పు వాయిద్యాలు, చెక్కభజన కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

నేడు కొలువుతీరనున్న గంగమ్మ 1
1/1

నేడు కొలువుతీరనున్న గంగమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement