సన్నద్ధతకు సమయమేదీ !
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. నోటిఫికేషన్‌కు.. పరీక్షలకు మధ్య గడువు 45 రోజులు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యం కాదనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందని సంతోషించాలో సన్నద్ధమయ్యేందుకు కనీస గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడా లో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. డీఎస్సీ పరీక్ష సన్నద్ధమయ్యేందుకు 45 రోజులు సమయం సరిపోదని సబ్జెక్టు నిపుణులు సైతం అంటున్నారు.
దరఖాస్తులో ఇవ్వని ఎడిట్ ఆప్షన్....
పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా రకాల పత్రాలను అడిగారని వాటిని సమకూర్చుకునేందుకే వారం పది రోజులు సమయం పడుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతోపాటు దర ఖాస్తు చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా చేసు కోవాల్సిన పరిస్థితి నెలకొనడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు సమయంలో ఏదైనా పొరబాటు జరిగితే ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వలేదని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. దీనికి తోడు డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారని గతంలో 40 శాతం మార్కులే ఉండేవని దానిని ఈ కూటమి ప్రభుత్వం 45 శాతానికి పెంచారని వాపోతున్నారు. ఇన్ని రకాల నిబంధనలకు తోడు.. పరీక్ష ప్రిపరేషన్‌కు కేవలం 45 రోజులు గడువు ఇవ్వడం చాలా అన్యాయం అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలు నెలరోజులు....
డీఎస్పీ పరీక్ష నిర్వహణ జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు చేపట్టనున్నారు. అంటే నెల రోజుల పాటు నిర్వహించనున్నారు.కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ విధానం) విధానంలో నిర్వహించనున్నారు. ిసీబీటీ విధానంలో నెల రోజులపాటు పరీక్షలను నిర్వహించడంతో ఒక రోజు పరీక్ష సులభంగా వస్తే మరో రోజు పరీక్ష కఠినంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది అభ్యర్థులకు మంచి జరిగితే మరికొంత మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉండటంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక్కరోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేవారు. ఇలాంటిది ఈసారి నెల రోజులపాటు సీబీటీ విధానంలో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు
సబ్జెక్టు ప్రభుత్వ, జెడ్పీ మున్సిపల్ మొత్తం
కార్పొరేషన్
ఎస్‌ఏ సంస్కృతం – – 01 01
ఎస్‌ఏ తెలుగు 26 – – 26
ఎస్‌ఏ ఉర్దూ 06 – 01 07
ఎస్‌ఏ హిందీ 16 01 01 18
ఎస్‌ఏ ఇంగ్లీస్ 78 01 02 81
ఎస్‌ఏ మ్యాథ్స్(టీఎం) 42 – 01 43
ఎస్‌ఏ మ్యాథ్స్(యూఎం) – 01 – 01
ఎస్‌ఏ పీఎస్(టీఎం) 28 – – 28
ఎస్‌ఏ పీఎస్(యూఎం) 02 – 01 03
ఎస్‌ఏ బీఎస్(టీఎం) 49 02 – 51
ఎస్‌ఏ బీఎస్(యూఎం) 02 – – 02
ఎస్‌ఏ ఎస్‌ఎస్(టీఎం) 58 1 1 60
ఎస్‌ఏ ఎస్‌ఎస్(యూఎం) 05 – – 05
ఎస్‌ఏ పీఈ 77 01 04 82
ఎస్‌జీటీ (టీఎం) 219 21 12 252
ఎస్‌జీటీ(యూఎం) 31 07 07 45
మొత్తం 639 35 31 705
డీఎస్సీ సన్నద్ధ్దతకు కేవలం
45 రోజులే గడువు
ప్రిపరేషన్‌కు 3 నెలల గడువు
అవసరం అంటున్న సబ్జెక్టు నిపుణలు
టీఎం: తెలుగు మీడియం... యూఎం: ఉర్దూ మీడియం
సన్నద్ధతకు సమయమేదీ !


